Share News

శుభకార్యానికి వెళ్లి వచ్చే లోపు రెండు ఇళ్లలో దొంగతనం

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:25 PM

ఇళ్లకు తాళం వేసి శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు దొంగలు చొరబడి, వెండి, బంగారు నగలు దోచుకెళ్లారు.

శుభకార్యానికి వెళ్లి వచ్చే లోపు రెండు ఇళ్లలో దొంగతనం
చోరి జరిగిన ఇంట్లో భాదితుడిని విచారిస్తున్న సీఐ రవిబాబు, ఎస్‌ఐ శేఖర్‌

- వెండి, బంగారు నగల చోరీ

- అలంపూర్‌ చౌరస్తాలో ఘటన

అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లకు తాళం వేసి శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు దొంగలు చొరబడి, వెండి, బంగారు నగలు దోచుకెళ్లారు. జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌ చౌరస్తాలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామానికి చెందిన శ్రీధర్‌ అనే వ్యక్తి అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుకనున్న ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అదే ఇంట్లోని మరో పోర్షన్‌లో అలంపూరు మండలం సింగవరం పంచాయతీ కార్యదర్శి అద్దెకు ఉంటున్నారు. రెండు కుటుంబాల వారు కర్నూలు నగరంలో జరిగిన శుభకా ర్యానికి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లి, మూడు గంటలకు తిరిగి వచ్చారు. అప్పటికే రెండు ఇళ్ల తాళాలు పగుల గొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. శ్రీధర్‌ ఇంట్లో రూ.1లక్ష, 4.5 గ్రాముల బంగారం, రాజశేఖర్‌ ఇంట్లో కొంత వెండి, మొబైల్‌ పోన్‌ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఉండవెల్లి ఎస్‌ఐ శేఖర్‌, సీఐ రవిబాబు, క్లూస్‌ టీంతో క లిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. దొం గలు వెనుక గోడ మీద నుంచి ఇంట్లోకి చొరబడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Updated Date - Oct 14 , 2025 | 11:26 PM