కుక్కను తప్పించబోయి..
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:26 PM
ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్‌పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.
- బైక్‌పై నుంచి కిందపడి వ్యక్తి మృతి
మదనాపురం అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బైక్‌పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొ త్తకోట పట్టణానికి చెందిన బాబా (35) మద నాపురంలో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నా డు. ఆదివారం మధ్యాహ్నం షాప్ బంద్ చేసి భోజనం చేయడానికి కొత్తకోటకు వెళ్తుండగా గోవిందహళ్లి గ్రామ శివారులో గల మైసమ్మ గుడి దగ్గర అకస్మాత్తుగా కుక్క అడ్డం రాగా దానిని ఢీకొట్టి కిం ద పడి పోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా, మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడికి భార్య తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.