యదార్థ గాథలే కథలకు మూలం
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:15 PM
నిత్య జీవితంలో జరిగే ఘటనలు, ఎదురయ్యే అనుభవాలే కథ, రచనలకు మూలాలుగా ఉం డటం స్వాగతార్హమని గద్వాల సాహితీ అధ్యక్షు డు అంబటి భానుప్రకాశ్ అన్నారు.
- గద్వాల సాహితీ అధ్యక్షుడు అంబటి భానుప్రకాశ్
గద్వాల టౌన్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : నిత్య జీవితంలో జరిగే ఘటనలు, ఎదురయ్యే అనుభవాలే కథ, రచనలకు మూలాలుగా ఉం డటం స్వాగతార్హమని గద్వాల సాహితీ అధ్యక్షు డు అంబటి భానుప్రకాశ్ అన్నారు. వేముల వాడకు చెందిన కథా రచయిత శ్రీలాల లింగ మూర్తి రచించిన ‘మళ్లీ పెళ్లి’ కథల పుస్తక పరి చయ సభను ఆదివారం పట్టణంలోని సరస్వతీ విద్యామందిర్‌లో ఏర్పాటు చేశారు. జోగుళాంబ గద్వాల సాహితీ, నడిగడ్డ సాహిత్య వేదిక ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పుస్తక స మీక్ష చేసిన సాహితీవేత్త నాయుడిగారి జయ న్న, కుటుంబాలకు తగిన సమయం ఇవ్వకపో వడంతో ఎదురయ్యే అనర్థాలు, కోల్పోయే అప్యా యతలు, కుటుంబాల్లో నెలకొనే విచ్ఛిన్న ధోరణ లు కథల్లో ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నారు. పుస్తక పరిచయాన్ని సాహితీవేత్త పూదత్తు భాస్కర్ నిర్వహించారు. ఆవిష్కర్తలుగా సా హితీవేత్తలు బీచుపల్లి, వెంకటయ్యగౌడ్ ఉన్నా రు. కథా రచయిత మాట్లాడుతూ తాను నిత్య జీవితంలో అనుభవించిన యధార్థ సంఘటనల ఆధారంగానే పుస్తకం రూపొందించినట్లు తెలి పారు. విధులు, బాధ్యతల నిర్వహణలో ఎంత ఒత్తిడి ఉన్నా కుటుంబాల కోసం తగిన సమ యం కేటాయించడం అత్యవసరమని తన జీవి త అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో గద్వాల సాహితీ కార్యదర్శి అనిమోని మహేం దర్, అవనిశ్రీ, మేడిచర్ల హరినాగ భూషణం, శంకర్, రాజశేఖరయ్య, మనోజ్‌ధోత్రే, శ్వేతారెడ్డి, రాముడు, రెహ్మత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.