పారదర్శకంగా అర్హుల ఎంపిక
ABN , Publish Date - Jul 19 , 2025 | 10:51 PM
తెలంగాణ వికలాంగుల సహ కార కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు అవస రమైన సహాయ ఉపకరణాలను అందించేం దుకు పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగు తుందని అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపా రు.
- అదనపు కలెక్టర్ యాదయ్య
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూలై19 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ వికలాంగుల సహ కార కార్పొరేషన్ ద్వారా దివ్యాంగులకు అవస రమైన సహాయ ఉపకరణాలను అందించేం దుకు పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగు తుందని అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపా రు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఐడీవోసీ సమావేశ మందిరంలో చేపట్టిన లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియకు అదనపు కలెక్టర్ హా జరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 215 దర ఖాస్తులు వచ్చాయన్నారు. దివ్యాంగులకు పంపి ణీ చేయనున్న ఉపకరణాల్లో వనపర్తి జిల్లాకు రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్స్ 40 మంజూరు చేయగా 136 దరఖాస్తులు వచ్చాయన్నారు. బ్యాటరీ వీల్‌చైర్‌లు 12 మంజూరు చేయగా 14 దరఖాస్తులు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకి ల్స్ 16 మంజూరు చేయగా 14 దరఖాస్తులు, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వాహనం ఒకటి మంజూరు కాగా 16 దరఖాస్తులు వచ్చాయ న్నారు. హైబ్రిడ్ వీల్ చైర్ నాలుగు మంజూరు కాగా 8 దరఖాస్తులు, ల్యాప్‌టాప్‌లు 14 మం జూరు కాగా ఆరు దరఖాస్తులు, ఉన్నత విద్య కోసం ల్యాప్‌టాప్‌లు ఆరు మంజూరు కాగా ఆ రు దరఖాస్తులు, 5జీ స్మార్ట్‌ఫోన్స్ రెండు మం జూరు కాగా దరఖాస్తులు ఐదు వచ్చినట్లు తెలి పారు. ట్యాబ్స్ పది మంజూరు కాగా ఒక్క దర ఖాస్తు కూడా రాలేదన్నారు. ఆయా ఉపకరణా ల పంపిణీ కోసం ధ్రువపత్రాలను పరిశీలించి ఎంపిక చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సం క్షేమ శాఖ అధికారి సుధారాణి, డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, రవాణా శాఖ అధికారి మానస, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.