పారదర్శకంగా అధ్యక్ష పదవులు
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:35 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా ఉంటుందని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు.
కొత్తకోట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా ఉంటుందని పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట, మదనాపురం మండలాల ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లా డుతూ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడా నికి డీసీసీ అధ్యక్ష నియామకాల ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. పనిచేసే కార్యకర్తలకు పద వులు ఇచ్చే సంప్రదాయం కాంగ్రెస్ లోనే ఉందన్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న నా యకుల వివరాలు ఏఐసీసీకి పంపిస్తామని తెలిపా రు. అక్కడ పూర్తిస్థాయిలో నివేదిక పరిశీలించిన తరు వాత డీసీసీ నియమాకం ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్ శక్తులైనా ఆదాని, అంబానీల కోసమే పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవ రైనా కేంద్ర ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ లచే దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చే స్తున్నరన్నారు. సమావేశంలో పీసీసీ పరిశీలకులు అ మీర్ అలీఖాన్, సంధ్యారెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రసాద్, మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, జితేంద్రనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శరత్‌రెడ్డి, బోయో జ్, కృష్ణారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.