కంచే లేని ట్రాన్స్‌ఫార్మర్
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:16 PM
పట్టణంలోని 12వ వార్డు జమ్ములమ్మనగర్ కాలనీ రోడ్డులో కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్‌తో మూగజీవాలతో పాటు కాలనీవాసులకు ప్రమాదం పొంచి ఉంది. 2019లో రైతుల పొలాల నుంచి మునిసిపల్ అధికారులు మట్టి రోడ్డును వేశారు. రోడ్డు వేసిన కొంత కాలానికి విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని 12వ వార్డు జమ్ములమ్మనగర్ కాలనీ రోడ్డులో కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్‌తో మూగజీవాలతో పాటు కాలనీవాసులకు ప్రమాదం పొంచి ఉంది. 2019లో రైతుల పొలాల నుంచి మునిసిపల్ అధికారులు మట్టి రోడ్డును వేశారు. రోడ్డు వేసిన కొంత కాలానికి విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసిన కొత్తలో నిర్మించిన దిమ్మె వర్షాలకు, రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి వచ్చిన వరద నీటికి మొత్తం కొట్టుకుపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ప్రస్తుతం ఎలాంటి రక్షణ గోడ లేదు. విద్యుత్ అధికారులు దిమ్మెను నిర్మించే వరకైనా తాత్కాలిక కంచెను కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతీ రోజు ఉదో ఓ చోట విద్యుత్ ప్రమాదాలకు ప్రజలు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు మాత్రం రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం కాగా, విద్యార్థులు ఈ రోడ్డు వెంటనే పాఠశాలలకు వెళ్తారు. ప్రతీ రోజు భక్తులు జమ్ములమ్మ ఆలయానికి వస్తుంటారు. సమీపంలోని రైతులు గేదెలు, గొర్రెలు, మేకలను సమీపంలోని పొలాల్లో మేపుతుంటారు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తెగి పడితే ప్రమాదాలు సంభవించే అవకాశాలు లేక పోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.