Share News

నేటి నుంచి గణితం ఉపాధ్యాయులకు శిక్షణ

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:01 PM

డిజిటల్‌ లర్నింగ్‌పై నేటి నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాలోని గణితం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్ష ణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు.

నేటి నుంచి గణితం ఉపాధ్యాయులకు శిక్షణ

  • గద్వాల డీఈవో విజయలక్ష్మి

గద్వాల సర్కిల్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ బోధనతో విద్యార్థుల్లో సాంకేతిక నైపు ణ్యం పెంపొందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టిన డిజిటల్‌ లర్నింగ్‌పై నేటి నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు జిల్లాలోని గణితం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్ష ణ ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డిజిటల్‌ తరగతులను నిర్వహించేందు కు ‘ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ డిజిటల్‌ లర్నింగ్‌’ అనే అంశంపై పాఠ్య ప్రణాళిక తరగతుల శిక్షణను రాష్ట్రంలో ప్రత్యేక శిక్షణ పొందిన మాస్టర్‌ టైనర్స్‌ డిజిటల్‌ డిస్ర్టిక్ట్‌ రీసోర్స్‌ పర్సన్స్‌ (డీడీఆ ర్పీ), డిజిటల్‌ మండల్‌ రీసోర్స్‌ పర్సన్స్‌ (డీఎంఆ ర్పీ) ద్వారా అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ కొరకు జిల్లాలోని 6 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల ను ఎంపిక చేసినట్లు తెలిపారు. గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల(గద్వాల, ఇటిక్యాల మండలాల ఉపా ధ్యాయులు),జడ్పీహెచ్‌ఎస్‌ ధరూర్‌ (ధరూర్‌, కేటీదొడ్డి, గట్టు మండలాల ఉపాధ్యాయులు), జడ్పీహెచ్‌ఎస్‌ మల్దకల్‌(మల్దకల్‌, ఎర్రవల్లి మండలాల ఉపాధ్యాయులు), జడ్పీహెచ్‌ఎస్‌ (బాలు రు) అయిజ(అయిజ మండల ఉపాధ్యాయులు), జడ్పీహెచ్‌ఎస్‌ శాంతినగర్‌(వడ్డేపల్లి, రాజో లి, మానవపాడు మండలాల ఉపాధ్యాయులు), జడ్పీహెచ్‌ఎస్‌ జల్లాపూర్‌(ఉండవల్లి, అలంపూర్‌ మండలాల ఉపాధ్యాయులు)లో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుందని వివరించారు.

Updated Date - Oct 08 , 2025 | 11:01 PM