Share News

నైపుణ్యం పెంపునకే శిక్షణ తరగతులు

ABN , Publish Date - May 23 , 2025 | 11:04 PM

వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.

నైపుణ్యం పెంపునకే శిక్షణ తరగతులు
శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో ప్రవీణ్‌కుమార్‌

- డీఈవో ప్రవీణ్‌కుమార్‌

జడ్చర్ల, మే 23 (ఆంధ్రజ్యోతి) : వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. జడ్చర్ల మండలంలోని ఉపాధ్యాయులకు జడ్చర్ల జడ్పీహెచ్‌ఎస్‌లో, మిడ్జిల్‌ మండలంలోని ఉపాధ్యాయులకు బాదేపల్లి బాలుర జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను శుక్రవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని, విద్యార్థులకు అత్యుత్తమమైన బోధన చేయాలన్నారు. అంతకుముందు రాజాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, ప్రతీ పాఠశాలలో కంప్యూటర్‌ విద్యకు ప్రాధాన్యమిచ్చి ఏఐ ఆధారిత బోధనా పద్దతులను అనుసరిస్తామన్నారు. జడ్చర్ల, రాజాపూర్‌ ఎంఈవోలు మంజులాదేవి, సుధాకర్‌, రీసోర్స్‌ పర్సన్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కోయిలకొండ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని శిక్షణ డైరెక్టర్‌ ఎంఈవో వెంకట్‌జీ సూచించారు. శుక్రవారం ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలుగు, గణితం, ఆంగ్లం, సైన్స్‌పై ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. డీఆర్పీలు రాజేందర్‌, నోమేష్‌, ఆర్పీలు వెంకటేష్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ బడుల అభివృద్ధికి కృషి చేయాలి

మూసాపేట : ప్రభుత్వ బడుల్లో అక్షరాస్యతను పెంచి విద్యా ప్రమాణాలు పెంపొందించి పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఏఎంవో అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి దుంకుడు శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ప్రైవేటుకు దీటుగా సర్కార్‌ బడుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించినప్పుడే నమ్మకం కలుగుతుందన్నారు. ప్రభుత్వ బడిని వినూత్నంగా నడిపించేందుకు ఉపాధ్యాయులకు ప్రభుత్వ శిక్షణ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ విద్యా సంవతర్సానికి విద్యార్థుల సంఖ్యతో పాటు కనీస సామర్థ్యాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు. ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి, ఆర్పీలు రవీందర్‌, వెంకటేష్‌ ఈవీఎస్‌, సురేష్‌, రాణి, రాఘవేందర్‌, మయూరి, సునీత, సిందూజ పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:04 PM