పండుగ పూట విషాదం
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:55 PM
దీపావళి పండుగ నేప థ్యంలో ఇంట్లోని పూజ గదిలో గల దేవుళ్ల ప టాలను తీస్తున్న మ హిళకు నాగుపాము కాటు వేసిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లో మంగళవారం చో టుచేసుకున్నది.
- పూజగదిలో మహిళకు నాగుపాము కాటు
- వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలింపు
కొల్లాపూర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : దీపావళి పండుగ నేప థ్యంలో ఇంట్లోని పూజ గదిలో గల దేవుళ్ల ప టాలను తీస్తున్న మ హిళకు నాగుపాము కాటు వేసిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లో మంగళవారం చో టుచేసుకున్నది. బాధి తురాలిని వైద్యం కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యన్మన్ బెట్ల గ్రామంలోని దళిత కాలనీలో నివాసం ఉంటున్న దళిత వెంకటమ్మ దీపావళి పండుగ సందర్భంగా తన ఇంటిలోని పూజ గదిలోకి వెళ్లి దేవుని పటాలను శుభ్రం చేసేందుకు తీస్తున్న క్రమంలో పటాల వెనుక దాగి ఉన్న నాగు పాము ఒక్కసారిగా ఆమెకు కాటువేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నాగుపామును వెతికి చంపి వెంట తీసుకొని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదన్న వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం నాగర్‌కర్నూల్‌లోని జనరల్ ఆసుపత్రికి వెంకటమ్మను తరలించారు.