Share News

భారత్‌మాల రోడ్డుతోనే రాకపోకలకు ఇబ్బందులు

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:23 PM

భారత్‌మాల రోడ్డు విస్తరణలో ఇంజనీర్ల తప్పిదంతో పర్ధిపురం నుంచి తూముకుంట గ్రామానికి రోడ్డు లేకుండా పోయిందని ఆయా గ్రా మాల రైతులు, గ్రామస్థులు కలెక్టర్‌కు విన్నవిం చారు.

భారత్‌మాల రోడ్డుతోనే రాకపోకలకు ఇబ్బందులు

- కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన పర్ధిపురం, తూముకుంట గ్రామాల రైతులు

గద్వాల న్యూటౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): భారత్‌మాల రోడ్డు విస్తరణలో ఇంజనీర్ల తప్పిదంతో పర్ధిపురం నుంచి తూముకుంట గ్రామానికి రోడ్డు లేకుండా పోయిందని ఆయా గ్రా మాల రైతులు, గ్రామస్థులు కలెక్టర్‌కు విన్నవిం చారు. బుధవారం అయిజ కూలీ రైతుసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కూలీ రైతు సంఘం అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి మాట్లాడుతూ భారత్‌మాల రోడ్డు విస్తరణలో భాగంగానే అయిజ మండలంలోని పర్ధిపురం నుంచి తూముకుంట గ్రామానికి రోడ్డు ఉండటంతో రాకపోకలకు సులువుగా ఉండేదన్నారు. అయితే భారత్‌మాల రోడ్డు విస్తరణలో ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా నే రోడ్డు లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యపై గతంలో స్ధానిక ఎమ్మెల్యేకు వినతిపత్రా న్ని అందించామని తెలిపారు. ఇప్పటికైనా అధి కారులు, పాలకులు స్పందించి సమస్యను పరి ష్కరించాలని కోరారు. కార్యక్రమంలో తిరుమలే ష్‌, తిమ్మప్ప, రాఘవేంద్రగౌడు, మల్లేష్‌, బాష, రాముడు, నర్సింహులు, నాగరాజు ఉన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:23 PM