డిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:12 PM
గత రెండు నెలలుగా దుందుభీ నది ప్ర వహిస్తుండడంతో డిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంటోంది.
- వరుస సెలవులతో పర్యాటకులతో బిజీగా మారిన జాతీయ రహదారి
- రెండు నెలలుగా దుందుభీ పరవళ్లు
అచ్చంపేట, న వంబరు 6 (ఆంధ్రజ్యోతి): గత రెండు నెలలుగా దుందుభీ నది ప్ర వహిస్తుండడంతో డిండి ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంటోంది. 765 జాతీయ రహదారి పై డిండి ప్రాజెక్టు ఉండడంతో సెలవుదినాలలో శ్రీశైలం-హైదరాబాద్ వెళ్లే పర్యాటకులు, భక్తులు డిండి పరవళ్లను ఆస్వాదిస్తూ తమ మొబైల్ ఫోన్లలో బంధించుకుంటూ సెల్ఫీ లు దిగుతున్నారు. ఈ దారి గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు కొన సాగిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున్న శ్రీశైలం వెళ్లే భక్తులు డిండి అందాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు.
చేపల ఫ్రై ఘుమఘుమలు..
డిండి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు డిండి వద్ద లభించే చేపలంటే ఎంతగానో ఇష్టపడతారు. కొందరు ప్రత్యేకంగా డిండి చేపల కోసమే స్నేహితులతో కలిసి వచ్చి ఇక్కడే విడిది చేస్తారు. ఈ క్రమంలో ప్రాజెక్టు సమీ పంలో జాతీయ రహదారికి ఇరువైపులా చేపల ఫ్రై దుకాణాలు వెలిశాయి. నా గార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో ఉన్న వైజాగ్ కాలనీని తలపించేలా డిండి అలు గు ప్రాంతంలో స్నేహితులు, బంధుమిత్రులతో జలపాతాళను తిలకిస్తూ చేపల ఫ్రైతో విందు, వినోదాలు జరుపుకుంటారు.