Share News

నల్లమలలో టూరిజం అభివృద్ధి

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:24 PM

ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆక ర్షించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నల్లమలలో టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్‌ సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

  నల్లమలలో టూరిజం అభివృద్ధి
అమరగిరి ఐలాండ్‌ వెల్‌నెస్‌ రిట్రీట్‌ నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో టూరిజం చైర్మన్‌ పటేల్‌ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- సోమశిల, అమరగిరి ఐలాండ్‌, కృష్ణగిరి ప్రాంతాల్లో వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్టుకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన

కొల్లాపూర్‌/మన్ననూర్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆక ర్షించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నల్లమలలో టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్‌ సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం కొల్లాపూర్‌, అచ్చంపేట నియోజకవర్గాల్లోని నల్ల మల ప్రాంతాల్లో పలు అభిపనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ మండల పరిధిలోని కృష్ణానది తీర ప్రాంతమైన అ మరగిరి ఐలాండ్‌లో సోమశిల గ్రామాల్లో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి పర్యాటక అభి వృద్ధిలో భాగంగా రూ.68.10 కోట్ల అంచనా వ్యయంతో వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్టుకు మంత్రి శంకుస్థాపన చేశారు. అమరగిరి గ్రామంలో నుంచి ఏసీ లాంచీలో అమరగిరి ఐలాండ్‌కు చేరుకుని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడు తూ... త్వరలోనే తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పే ర్కొన్నారు. ఇందులో భాగంగా ఈజ్‌ మై ట్రిప్‌ సంస్థ సహకారంతో హైదరా బాద్‌కు హెలీ టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు స్ప ష్టం చేశారు. దీని వల్ల తెలంగాణ పర్యాటక రంగం కూడా కొత్త మలుపు తి రుగుతుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో అమరగిరిలో రూ.45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్‌ వెల్‌నెస్‌ రిట్రీట్‌ నిర్మాణ పను లు రూ.1.60 కోట్లతో సోమశిల వీఐపీ ఘాట్‌, బోటింగ్‌ పాయింట్‌ కోసం ట్రెం చింగ్‌ పనులకు పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి, ఎమ్మె ల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి భూమిపూజ చేశారు. విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించి తద్వారా ఉద్యోగ కల్పనతో పాటు ఆయా ప్రాం తాల్లో మౌలిక వసతులు మెరుగవుతాయని పేర్కొన్నారు. పర్యాటకులను ఐ లాండ్‌ తీసుకువచ్చేలా ఫ్లోటింగ్‌ జెట్టి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రా ష్ట్రం పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.

కృష్ణగిరిలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

నల్లమలను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్‌ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని కృష్ణగిరి(ఈగలపెంట) వద్ద వెల్‌నెస్‌, స్పిరిచువల్‌ రిట్రీట్‌ ప్రాజెక్టులో భాగంగా రూ.20కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పర్యాటక అభివృద్ధి పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణతో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. రూ.3.60కోట్లతో చెంచు మ్యూజియం పునరుద్ధరణ సివిల్‌ పనులు, నీటి సదుపాయం, శానిటరీ ఎలక్ర్టికల్‌ సౌకర్యాల కల్పన, రూ.8.36 కోట్లతో అరైవల్‌ జోన్‌ ప్రోమెనెడ్‌ అభివృద్ధి పనులు, 7.69 కోట్లతో కృష్ణగిరి రివర్‌ క్రూయిజ్‌నోడ్‌ రూప్‌టాప్‌ కేఫే, వ్యూయింగ్‌ డెక్‌, నీటి సరఫరా సానిటరీ, ఎలక్ర్టికల్‌, ల్యాండ్‌స్కేప్‌ పనులను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో నల్లమలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. బ్రహ్మగిరి, కృష్ణగిరి ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున్‌, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు చత్రూనాయక్‌, మోయిజొద్దీన్‌, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:24 PM