Share News

టెన్త్‌లో టాప్‌

ABN , Publish Date - Apr 30 , 2025 | 11:27 PM

ఉమ్మడి పాలమూరు జి ల్లాలో నాగర్‌కర్నూల్‌ టెన్త్‌లో టాప్‌లో నిలిచిం ది. పదో తరగతి వార్షిక ఫలితాలు 2025లో నా గర్‌కర్నూల్‌ జిల్లా విద్యార్థులు 96.83 శాతం ఉత్తీర్ణులయ్యారు.

టెన్త్‌లో టాప్‌
నాగర్‌కర్నూల్‌ జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి స్థానం

- పది ఫలితాల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 96.83 శాతం ఉత్తీర్ణత

- రాష్ట్ర స్థాయిలో 13వ స్థానం

- ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జి ల్లాలో నాగర్‌కర్నూల్‌ టెన్త్‌లో టాప్‌లో నిలిచిం ది. పదో తరగతి వార్షిక ఫలితాలు 2025లో నా గర్‌కర్నూల్‌ జిల్లా విద్యార్థులు 96.83 శాతం ఉత్తీర్ణులయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా రాష్ట్ర స్థా యిలో 13వ స్థానంలో నిలువగా ఉమ్మడి పాల మూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో 23వ స్థానంలో నిలిచిన నాగ ర్‌కర్నూల్‌ జిల్లా ఈసారి ఫలితాలను మెరుగుపరుచు కోవడమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో వరుసగా 8 సార్లు నాగర్‌కర్నూల్‌ జిల్లా మొ దటి స్థానంలో నిలువడం గమనార్హం.

100 పాఠశాలల్లో వంద శాతం పాస్‌

జిల్లాలోని అన్ని యాజ మాన్యాలకు చెందిన 100 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించి న వాటిలో 60 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 40 ప్రై వేటు పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలోని 20 కేజీబీవీల్లో 10 కేజీబీవీలు 100 శాతం పాసయ్యా రు. జిల్లా విద్యార్థులు 96.83 శాతం ఉత్తీర్ణత సాధించ డం పట్ల జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేస్తూ పాసయిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా గత ఏడాది కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించడంతో పలువురు ఉపా ధ్యాయులు డీఈవోను కలిసి సన్మానించారు.

ఫలితాల్లో బాలికలదే పైచేయి

పదో తరగతి వార్షిక ఫలితాల్లో నాగర్‌కర్నూల్‌ జి ల్లాలో ఈ ఏడాది బాలికలే పైచేయి సాధించారు. జి ల్లా వ్యాప్తంగా మొత్తం 10,530 మంది విద్యార్థుల ప రీక్షలు రాయగా అందులో 5230 మంది బాలురకు గాను 5013 మంది ఉత్తీర్ణులవగా, 5300 మంది బా లికలకు గాను 5183 మంది పాసయ్యారు. ఈసారి అదనంగా 5.26 శాతం విద్యార్థులు ఉత్తీర్హులయ్యారు.

Updated Date - Apr 30 , 2025 | 11:27 PM