కళాశాలలో మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:08 PM
జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కలాశాలలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలను ఏర్పాటు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల డిమాండ్ చేశా రు.
వనపర్తి విద్యావిభాగం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కలాశాలలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలను ఏర్పాటు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు సాయిలీల డిమాండ్ చేశా రు. శుక్రవారం కళాశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. సుమారు 650 మంది విద్యార్థినులు ఉన్నా కేవలం మూడు మూత్రశాలలు మాత్రమే ఉండడం సిగ్గుచేట న్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమం లో కోశాధికారి కవిత, సహాయ కార్యదర్శి రేణు క, శ్యామల తదితరులు పాల్గొన్నారు.