నేడు కార్తీక పౌర్ణమి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:18 PM
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించుకునేందుకు భక్తులు ఏర్పాట్లు పూర్తి చేసుకోనున్నారు.
- గౌరీ నోములు ఆచరించనున్న మహిళలు
- ఆలయాల్లో దీపారాధన, ప్రత్యేక పూజలు
మహబూబ్‌నగర్ న్యూటౌన్/ నారాయణపేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించుకునేందుకు భక్తులు ఏర్పాట్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో మహిళలు దీపారాధన చేయనున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆలయ కమిటీలు అందుకు అవసర మైన ఏర్పాట్లు చేశారు. అమావాస్య నోములు లేని మహిళలు, కార్తీక పౌర్ణమి సందర్భంగా కేదారేశ్వర, గౌరీ నోములు నోచుకోనున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నోములు, వ్రతాలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. శైవాలయాల్లో అర్చకులు లఘున్యా సపూర్వక, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయనున్నారు. కార్తీక పౌర్ణమి నాడు ఆలయాల్లో ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయని అర్చకుడు గొండ్యాల రాఘవేంద్ర శర్మ తెలిపారు.