Share News

నేడు జములమ్మ కల్యాణోత్సవం

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:43 PM

నడిగడ్డలో భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటు న్న జములమ్మ కల్యాణోత్పవాన్ని మంగళవా రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏ ర్పాట్లు పూర్తిచేశారు.

నేడు జములమ్మ కల్యాణోత్సవం
పల్లకీని మోస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): నడిగడ్డలో భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటు న్న జములమ్మ కల్యాణోత్పవాన్ని మంగళవా రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏ ర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలంకరణ, పూలతో అందంగా అలంకరించారు. ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఎదుర్కోళ్లను నిర్వహించేందుకు జములమ్మ ఆలయం నుంచి పల్లకిలో జమ్మిచేడులోని ఆంజనేయస్వామి దే వాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వివిధ వేశాధారణలతో చేసిన వి న్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జమ్మిచే డు గ్రామానికి చేరుకున్న తర్వాత స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం గ్రామస్థుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై దగ్గరుండి ఎదు ర్కోలు కార్యక్రమం జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకీసేవను మోశారు. దీనిని చూ సేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడి నుం చి తిరిగి స్వామివారిని ఆలయంలోకి చేర్చారు.

నేడు అమ్మవారికి కల్యాణ ం

శ్రీ జమదగ్ని సమేత జములమ్మ అమ్మవారికి మంగళవారం కల్యాణం నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు ఎమ్మెల్యే దంపతులచే కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ వెంకట్రాములు తెలిపారు. పెద్దఎత్తున భక్తులు, ప్రజలు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 11:43 PM