Share News

రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలి

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:12 PM

రైతులు పం డించిన పొగాకును కంపెనీ వారు వెంటనే కొ నుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హన్మంతునాయుడు డిమాండ్‌ చేశారు.

రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలి

గట్టు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రైతులు పం డించిన పొగాకును కంపెనీ వారు వెంటనే కొ నుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హన్మంతునాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని మిట్టదొడ్డి, తుమ్మలపల్లి, ముచ్చోనిపల్లి, చాగదోణ గ్రామాల రైతులు తమ పొగాను కంపెనీ వారు కొనుగోలు చేయడంలేదని, దీంతో తాము పొగాకును నిల్వ చేసుకోలేక ఇబ్బందులకు గు రవుతున్నామని హన్మంతునాయుడు దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన బీఆర్‌ఎస్‌ నాయకుడు హన్మంతునాయుడు ఫోన్‌ ద్వారా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. రైతులు పండించిన పొగాకును ఎందుకు కొనుగోలు చేయడంలేదని వారిని ప్రశ్నించారు. పొగాకును కంపెనీ వారు తీసుకోకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి వివరించారు. దీం తో రైతుల నుంచి పొగాకును వారం లోపు మొత్తం కొనుగోలు చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

Updated Date - Jun 30 , 2025 | 11:12 PM