Share News

క్రికెట్‌ పోటీల్లో రాణించాలి

ABN , Publish Date - May 15 , 2025 | 10:55 PM

క్రీడాకారులు క్రికెట్‌ పోటీల్లో రాణించాలని ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి సుదర్శన్‌రావు అన్నారు.

క్రికెట్‌ పోటీల్లో రాణించాలి
క్రికెట్‌ క్రీడాకారుల జిల్లా జట్టుతో సుదర్శన్‌రావు

- జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి సుదర్శన్‌రావు

నారాయణపేట, మే 15 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు క్రికెట్‌ పోటీల్లో రాణించాలని ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి సుదర్శన్‌రావు అన్నారు. గురువారం నారాయణపేట మినీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రికెట్‌ అండర్‌-14, అండర్‌-19 క్రీడాకారుల ఎంపిక హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, మహబూబ్‌నగర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగింది. పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి 56 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలు ప్రారంభించిన సుదర్శన్‌రావు మాట్లాడుతూ పోటీలో చక్కగా ఆడి జిల్లాకు క్రీడాకారులు పేరు ప్రఖ్యా తలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ముక్తార్‌, రమణ, అజయ్‌కుమార్‌, కార్తీక్‌, ఆంజనేయులు, అశోక్‌రెడ్డి, చిన్నారెడ్డి తదితరులున్నారు.

Updated Date - May 15 , 2025 | 10:55 PM