Share News

టోర్నీలో విజేతగా నిలవాలి

ABN , Publish Date - May 18 , 2025 | 11:21 PM

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ లో విజేతలుగా నిలువాలని ఉమ్మడి జిల్లా ఒ లింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్‌ అ న్నారు.

టోర్నీలో విజేతగా నిలవాలి
ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్‌ బాల, బాలికల జట్లతో ఒలింపిక్‌ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్‌, అసోసియేషన్‌ సభ్యులు

- ఒలింపిక్‌ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్‌

- ఉత్సాహంగా జిల్లా హ్యాండ్‌బాల్‌ జట్ల ఎంపిక

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ లో విజేతలుగా నిలువాలని ఉమ్మడి జిల్లా ఒ లింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్‌ అ న్నారు. నల్గొండ జిల్లా మంగళపల్లిలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎం పికలను ఆదివారం స్థానిక స్టేడియంలో నిర్వ హించారు. ఎంపికలను ఒలంపిక్‌ సంఘం ఉ మ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్‌, టీజీపీ డీ,పీఈటీఏ రాష్ట్ర అధ్యక్షుడు దూమర్ల నిరంజన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్‌ ఉంటుందన్నారు. గుర్తింపు ఉన్న క్రీడ లను ఎంపిక చేసుకోవాలని, క్రీడా కోటాలో ఉద్యోగ అవకాశలు లభిస్తాయని తెలిపారు. జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్య దర్శులు సయ్యద్‌ తఖీయొద్దీన్‌, శంకర్‌నాయక్‌, మోగులాల్‌, సర్ఫారాజ్‌, రోజా, అభిలాష్‌, అశోక్‌, ఉమాశంకర్‌, శివకుమార్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:21 PM