టీజేఎఫ్ రజతోత్సవ సంబురాలకు తరలిరావాలి
ABN , Publish Date - May 30 , 2025 | 11:21 PM
తెలంగాణ ఉద్య మంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం గర్వంగా ఉందని తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్-143 జాతీయ కార్యవర్గ సభ్యుడు వారధి నవీన్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కలాల్ ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు.
నారాయణపేట న్యూటౌన్, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్య మంలో కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం గర్వంగా ఉందని తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్-143 జాతీయ కార్యవర్గ సభ్యుడు వారధి నవీన్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కలాల్ ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్య మంలో జర్నలిస్టుల పాత్రను తెలియజేస్తూ రెండు దఫాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసిన ఏకైక జర్నలిస్టు యూనియన్ టీజేఎఫ్ అని పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ అనంతరం టీయూడబ్ల్యూజే (హెచ్- 143)గా ఏర్పాటు అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన టీజేఎఫ్ 25వ వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 31న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించ తలపెట్టిన రజత్సోతవ వేడుకలను జిల్లా నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడిగె అనంతరామ్, ఎలక్ర్టానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, యూనియన్ సభ్యులు శ్రీధర్, రహీం, శ్రీనివాస్, అంబదాస్, రాము, వినోద్ శ్రీనివ సులు పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ విడుదల
మాగనూరు : ఈనెల 31న హైదరాబాద్‌లో ని జలవిహార్‌లో జరగనున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం 25వ వసంతాల సంబురాలకు సం బంధించిన వాల్‌పోస్టర్‌ను శుక్రవారం మాగ నూరులో తహసీల్దార్ సురేష్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్‌ఐ శ్రీశైలం, జర్నలిస్టులు రాము, చంద్రశేఖర్‌గౌడ్, శివకుమార్, వర్కూరు రాజు, శ్రీనివాసులు ఉన్నారు.