Share News

ఘనంగా తిరుపతిరెడ్డి జన్మదినం

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:39 PM

కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి జన్మదినాన్ని పార్టీ కోస్గి మండల నాయకులు స్థానిక శివాజీ చౌరస్తాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా తిరుపతిరెడ్డి జన్మదినం
కోస్గి శివాజీ చౌరస్తాలో తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు

కోస్గి రూరల్‌/ మద్దూర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి జన్మదినాన్ని పార్టీ కోస్గి మండల నాయకులు స్థానిక శివాజీ చౌరస్తాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు పంచుకున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి తిరుపతిరెడ్డి చేస్తున్న సేవలను నాయకులు కొనియా డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌ కుమార్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు తూం భీమ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, నాయకులు అన్నకిష్టప్ప, నరేందర్‌, బెజ్జురాములు, మహేందర్‌గౌడ్‌, ప్రభాకర్‌, హరి తదితరులున్నారు. అదేవిధంగా, గుండుమాల్‌లోని శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కేక్‌ కట్‌ చేశారు.

మద్దూర్‌, కొత్తపల్లి మండలాల్లో తిరుపతిరెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేశారు. మద్దూర్‌ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, పీఏ సీఎస్‌ అధ్యక్షుడు నర్సింహ, రఘుపతిరెడ్డి, కొత్తపల్లి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, చెన్నప్ప, విజయ్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Aug 08 , 2025 | 11:39 PM