నేడు పాలమూరులో తిరంగా ర్యాలీ
ABN , Publish Date - May 17 , 2025 | 11:12 PM
ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా సైనికులు తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో పాలమూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు స్టేడియం గౌండ్ నుంచి గడియారం చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 17 (ఆంధ్రజ్యోతి) : ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా సైనికులు తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో పాలమూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు స్టేడియం గౌండ్ నుంచి గడియారం చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ర్యాలీకి పట్టణ ప్రజలు అధికంగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ర్యాలీపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, నాయకులు కృష్ణవర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రామాంజనేయులు, అంజమ్మ, సుబ్రహ్మాణ్యం, రాజేందర్‌రెడ్డి, వెంకటేశ్వరమ్మ, బాలేశ్వరమ్మ పాల్గొన్నారు.
తిరంగా ర్యాలీని జయప్రదం చేయాలి
ఆదివారం పాలమూరు పట్టణంలో చేపట్టిన తిరంగా ర్యాలీకి పట్టణ ప్రజలు అధికంగా పాల్గొని తిరంగా ర్యాలీని జయప్రధం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.