కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:14 PM
నారాయణపేట టౌన్, రూరల్, దామరగిద్దలో జరగనున్న పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లను దృష్టి లో ఉంచుకుని, ఎస్‌ఐలు వెంక టేశ్వర్లు, రాముడు, రాజు ఆదివా రం నామినేషన్ కేంద్రాలను సం దర్శించారు.
నారాయణపేట/దామరగిద్ద, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట టౌన్, రూరల్, దామరగిద్దలో జరగనున్న పంచా యతీ ఎన్నికల ఏర్పాట్లను దృష్టి లో ఉంచుకుని, ఎస్‌ఐలు వెంక టేశ్వర్లు, రాముడు, రాజు ఆదివా రం నామినేషన్ కేంద్రాలను సం దర్శించారు. ఈ సందర్భంగా అధి కారులు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, నామి నేషన్ దాఖలు కోసం వచ్చే అభ్యర్థులు, ప్రజ లకు అందుబాటులో ఉంచాల్సిన ప్రాథమిక సౌకర్యాలను పూర్తిగా పరిశీలించారు. సమస్యా త్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ రోజు ఎటువంటి అంతరాయాలు లేకుండా శాం తి భద్రతల మధ్య ఎన్నికలు జరిగేలా అన్ని ఏ ర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధి కారులు మాట్లాడుతూ... సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బందోబస్తు, తాగునీటి సౌకర్యం, మరు గుదొడ్లు, ప్రహరీ గోడలు మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియు తంగా సాగేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.