Share News

నీట్‌కు పటిష్ట బందోబస్తు : ఎస్పీ

ABN , Publish Date - May 03 , 2025 | 11:17 PM

నేడు జరగనున్న నీట్‌ (యూజీ) పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నీట్‌కు పటిష్ట బందోబస్తు : ఎస్పీ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, మే 4 (ఆంధ్రజ్యోతి) : నేడు జరగనున్న నీట్‌ (యూజీ) పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 13 పరీక్షా కేంద్రాల్లో 4,454 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పోలీస్‌ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే ప్రాంతంలో ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు రెండు పాస్‌ఫొటో సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. విద్యార్థుల, ఇన్విజిలేటర్ల ఫోన్లు ఇతర ఎలాకా్ట్రనిక్‌ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవన్నారు. షూష్‌, సాక్స్‌, బంగారు, వెండి, ఫూల్‌షర్ట్స్‌ ధరించరాదని సూచించారు. పారదర్శకంగా ఉండే దుస్తులు, వాటర్‌ బాటిల్స్‌ను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలులో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంక్షలు అమలులో ఉంటాయన్నారు. నీట్‌ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డ్‌లో పొందుపరిచిన నియమ నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని సూచించారు.

Updated Date - May 03 , 2025 | 11:17 PM