Share News

కట్టుదిట్టంగా భద్రత

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:40 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు.

కట్టుదిట్టంగా భద్రత
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

  • జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ప్రకారం భద్రత కట్టుది ట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఓట ర్లను ప్రభావితం చేయడానికి డబ్బు, మద్యం, రాకుండా చెక్‌పోస్టుల వద్ద ఇతరశాఖల సమన్వయంతో తనిఖీలు చేయాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాలని, సోషల్‌ మీడియాపై నిఘా ఉంచాలన్నారు. లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, కమ్యూనిటీ హాలులు, ఫంక్షన్‌ హాలులో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సంబందించిన అంశా ల్లో, రాజకీయ కార్యక్రమాల్లో పోలీస్‌ సిబ్బంది ఎలాంటి ప్రమేయం ఉండకూడదని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Nov 27 , 2025 | 11:40 PM