పోలేపల్లి గ్రామ పంచాయతీలో త్రిసభ్య కమిటీ విచారణ
ABN , Publish Date - May 03 , 2025 | 10:59 PM
పోలేపల్లి గ్రామపంచాయతీలో జరిగిన అవినీతి, అక్ర మాలపై కలెక్టర్ ఏర్పాటు చేసిన త్రిసభ్య క మిటీ శనివారం మరో పర్యాయం విచారణ చే పట్టింది.
- రెండవ పర్యాయం నిర్వహించిన విచారణలో పాల్గొన్న మాజీ సర్పంచ్
- వచ్చిన అభియోగాలపై ఈ నెల 12లోగా పూర్తి ఆధారాలతో సంజాయిషీ ఇవ్వాలని అవకాశం
జడ్చర్ల, మే 3 (ఆంధ్రజ్యోతి) : పోలేపల్లి గ్రామపంచాయతీలో జరిగిన అవినీతి, అక్ర మాలపై కలెక్టర్ ఏర్పాటు చేసిన త్రిసభ్య క మిటీ శనివారం మరో పర్యాయం విచారణ చే పట్టింది. డీఆర్డీఏ నర్సింహులు, పీఆర్ ఈఈ నరేందర్‌రెడ్డి, జడ్చర్ల ఎంపీడీవో విజయ్‌కుమా ర్‌ల త్రిసభ్య కమిటీ సభ్యులు పోలేపల్లి గ్రామ పంచాయతీలో 2019-20 నుంచి 2023-24వ ఆర్థిక సంవత్సరం వరకు జరిగిన అవినీతి, అ క్రమాలపై మాజీ సర్పంచ్ చేతనరెడ్డి, బదిలీ పై వెళ్లిన గ్రామపంచాయతీ కార్యదర్శి శివప్ర సాద్‌లతో విచారణ నిర్వహించారు. ఐదు సం వత్సరాలలో రూ. కోటీ 73లక్షలు అవినీతి, అ క్రమాలు జరిగాయంటూ గత సంవత్సరం సె ప్టెంబరులో అప్పటి డీఎల్‌పీవో పండరీనాథ్ విచారణ చేపట్టి, పూర్తి నివేదికను కలెక్టర్‌కు అప్పగించారు. ఆ అంశంపై తాజాగా పూర్తి విచారణ చేపట్టి నివేదికను అందచేయాలం టూ త్రిసభ్య కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గత నెల 16న చేపట్టిన విచారణలో మాజీ సర్పంచ్ హాజరు కాకపోవడంతో తాజాగా మరొక పర్యాయం వి చారణ చేపట్టారు. ఈ విచారణలో మాజీ స ర్పంచ్ చేతనరెడ్డితో పాటు ఆమె భర్త రాం చంద్రారెడ్డి సైతం హాజరయ్యారు. ఎక్స్‌కవేటర్ లతో పనులు నిర్వహించినట్లుగా ఎంబీ రికా ర్డు లేకుండానే డబ్బులను డ్రా చేసినట్లు, అ లాగే సీసీ కెమెరాలకు సైతం లక్షల రూపా యలు వెచ్చించినట్లు మాజీ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శిలపై అభియోగాలు వ చ్చాయి. రూ.5వేలకు పైగా చేపట్టిన పనులకు ఎంబీ రికార్డు చేసి, చేపట్టిన వారికి చెక్కుల ను ఇవ్వాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్య వహరించినట్లుగా అభియోగాలు పొక్కాయి. విచారణలో తాము ఎలాంటి అవినీతి, అక్ర మాలకు పాల్పడలేదంటూ మాజీ సర్పంచ్ చే తనరెడ్డి, ఆమె భర్త రాంచంద్రారెడ్డిలు విచార ణ కమిటీ సభ్యులకు వివరించారు. ఎంబీ రి కార్డు లేకుండానే డబ్బులను నేరుగా డ్రా చేసి న అంశాలను విచారణ కమిటీ సభ్యులు ప్ర శ్నించిన సందర్భంలో గ్రామపంచాయతీ కార్య దర్శికి అన్ని పత్రాలను ఇచ్చినట్లుగా పేర్కొన్న ట్లుగా తెలిసింది. ఈ అంశంలో బిల్లులు ఉ న్నాయని ఒక పర్యాయం, ఎంబీ రికార్డులు చే శామంటూ మరొక పర్యాయం పొంతన లే కుండా గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధు లు నిర్వహించిన శివప్రసాద్ విచారణ అధికా రులకు చెప్పినట్లుగా తెలిసింది. ఈ నెల 12 లోగా వచ్చిన అభియోగాలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో సంజాయి షీ ఇవ్వాలని లేనిపక్షంలో ఫైనల్ రిపోర్ట్‌ను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఈ సందర్భం గా డీఆర్డీఏ నర్సింహులు మరొక అవకాశం ఇచ్చారు. ఎలాంటి ఎంబీ రికార్డులు లేకుండా, ఎలాంటి బిల్లులు లేకుండానే, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను డ్రా చేసిన మాజీ సర్పంచ్, అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శి లపై చర్యలు తీ సుకోవాలంటూ గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విచారణలో డీఆర్డీఏ పర్య వేక్షకురాలు హేమలత, పోలేపల్లి గ్రామపం చాయతీ ప్రస్తుత కార్యదర్శి లక్ష్మీనారాయణ ఉన్నారు.