వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:23 PM
వేర్వేరు రోడ్డు ప్ర మాదాల్లో ముగ్గురు మృతి చెందారు.
వనపర్తి రూరల్/అచ్చంపేటటౌన్/జడ్చర్ల, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు రోడ్డు ప్ర మాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వనపర్తి మండల పరిధిలోని రాజపేట గ్రామ శివారు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన స్థానికుల వివరాల మేరకు.. కొత ్తకోట పట్టణ కేంద్రానికి చెందిన మల్లికార్జున్ (48) డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ తన కు టుంబాన్ని పోషించేవాడు. గత ఏడాది వనపర్తి పట్టణ కేంద్రంలో ఓ స్కూ ల్ బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. ఈ ఏడాది డ్రైవర్‌గా కొనసా గడానికి బస్సులు లేకపోవడంతో స్కూల్ యాజమాన్యం నిరాకరించింది. స్కూల్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహించేందుకు పాఠశాలలో కలిసి వస్తాన ని కుటుంబ సభ్యులకు చెప్పి వనపర్తికి వచ్చాడు. తిరిగి కొత్తకోటకు వ స్తుండగా రాజపేట గ్రామ శివారులో బైకు అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు జిల్లా ఏరియా ఆసుపత్రికి తర లించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ జలంధర్ రెడ్డిని వివరణ కోరగా కుటుంబ సభ్యులు మృతుని కూతురు భార్గవి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు.
బొమ్మన్‌పల్లిలో ఆశ వర్కర్..
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెంది న సంఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధలోని బొమ్మన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల ప రిధిలోని పెద్దతండా గ్రామానికి చెందిన కా ట్రావత్ దేవి (48) గ్రామంలో ఆశ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అవసరం నిమిత్తం బొమ్మన్‌పల్లి గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా, గ్రామంలో ద్విచక్ర వాహ నంపై నుంచి జారిపడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను అ చ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సోదరుడు రవి ఫిర్యాదు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన లారీ
ఆగి ఉన్న డీసీఎంను లారీ ఢీ కొన్న సంఘటనలో లారీ క్లీనర్ మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల హౌజింగ్‌బోర్డు సమీపంలోని దర్గా వద్ద చోటుచేసుకుంది. జడ్చర్ల సీఐ కమ లాకర్ తెలిపిన వివరాల మేరకు... కర్నాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా జంగమ రకాల్గుడి గ్రామానికి చెందిన ఆసీఫ్(23) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. లారీ డ్రైవర్ శివకుమార్‌తో కలిసి శుక్రవారం నాడు కొప్పల్ నుంచి హైద రాబాద్‌కు బర్రెలను తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో జడ్చర్ల హౌజింగ్ బోర్డు వద్ద ఎలాంటి జాగ్రత్తలు పాటించకుంఛ్ఛి రోడ్డుపై ఆపిన డీసీఎంను లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో లారీ క్లీనర్ ఆసీఫ్‌కు తీవ్రగాయాల య్యాయి. చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యప రీక్షలు నిర్వహించగా అప్పటికే మృతిచెందాఛిని వైద్యులు తెలిపారు. ఆసీఫ్ సోదరుడు మహమ్మద్‌అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడ్తున్నట్లు జడ్చర్ల సీఐ కమలాకర్ తెలిపారు.