ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు మూడు కేంద్రాలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:20 PM
నేడు (ఆదివారం) జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) 2025-26 పరీక్షకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి
హాజరుకానున్న 728 మంది విద్యార్థులు
గద్వాలసర్కిల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నేడు (ఆదివారం) జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) 2025-26 పరీక్షకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. 728 మంది విద్యార్థులు హాజరయ్యే ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు డీఈవో విజయలక్ష్మి, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగే పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 40 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.