హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:35 PM
దళిత యువకుడిపై దాడి చేసి, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కేవీపీఎస్ నాయకుల నిరసన
రాజోలి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : దళిత యువకుడిపై దాడి చేసి, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలిలోని గాంధీచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి విజయ్‌కుమార్ మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామ దళితుడు ఎర్రశేఖర్ కులాంతర వివాహం చేసుకున్నందున, కిడ్నాప్ చేసి దారు ణంగా హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని అన్నారు. కార్యక్రమంలో విజయ్ కు మార్, ఆనంద్ బాబు, రవి, సీఐటీయూ నా యకులు లక్ష్మన్న, మద్దిలేటి పాల్గొన్నారు.