నమ్మించి నట్టేట ముంచారు
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:40 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన మాటలను ప్రజలు నమ్మి మోసపోయారని మాజీ మం త్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

- సానుభూతి చూపితే పంటలకు సాగునీరు రాదు
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
పెబ్బేరు, ఏప్రిల్ 12 (ఆంద్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన మాటలను ప్రజలు నమ్మి మోసపోయారని మాజీ మం త్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రజతోత్సవ సన్నాహక కార్యక్ర మంలో భాగంగా శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఉమ్మడి మండల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలిచిన వెంటనే సంత స్థలం తెస్తానని హామీ ఇచ్చి మరిచారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో 21 మెగావాట్ల విద్యుత్ ఉన్నప్పుడు రెప్ప పాటు కూడా కరెంట్ పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన త ర్వాత 23మెగావాట్ల విద్యుత్ ఉన్నప్పటికీ కరెంటు ఉండటం లేద న్నారు. నాపై కొన్ని దుష్ట శక్తులు ద్రుష్పచారం చేసి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే పెబ్బేరు, ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపాధనలు పంపామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాటిని అమలు చేయాలన్నా రు. సాగునీరుపై ముందుచూపు లేకుండా యాసంగిలో పంటలు వేసుకో వాలని చెప్పి, ఇప్పుడు సానుభూతి చూపితే పంటలు పండవని ఎద్దేవా చేశారు. 27న జరిగే రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అఽధ్యక్షుడు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, వనం రాములు యాదవ్, విశ్వరూపం, రాజశేఖర్, రమేష్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.