ఇవీ మేం ఎదుర్కొంటున్న సమస్యలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:35 PM
‘మాకు మందు, డబ్బులు అవ సరం లేదు. మా సమ స్యలను పరిష్కరించే వారికే ఓటు వేస్తాం’
- పరిష్కరించే వారికే ఓటు
- కర్ని గ్రామంలో వాల్ పోస్టర్
మక్తల్‌రూరల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ‘మాకు మందు, డబ్బులు అవ సరం లేదు. మా సమ స్యలను పరిష్కరించే వారికే ఓటు వేస్తాం’ అని నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని కర్ని గ్రామ ఎస్సీ వాడ ప్రజలు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఓ ఫ్లెక్సీని రూపొందించి ఏర్పాటు చేశారు. తమ వాడకు వచ్చే అభ్యర్థులు మందు, డబ్బు పంచొద్దని, సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి చేయాలని ఆ పోస్టర్లో పేర్కొన్నారు. పరిష్కరించాల్సిన సమస్యలను, చేపట్టాల్సిన పనులను అందులో పొందుపరిచారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి, లైబ్రరీ, కమ్యూనిటీ హాల్ నిర్మించాలి, అంబేడ్కర్, ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలి, లో ఓల్టేజీ విద్యుత్ సమస్యను పరిష్కరించాలి, తదితర డిమాండ్లు చేశారు.