ఎన్నికల నిర్వహణలో భద్రతా సమస్యలు రావొద్దు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:42 PM
మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎక్కడా, ఎలాంటి సమస్య తలెత్తకుండా వి ధులు నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు.
ఎన్నికల విధులపై పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆదేశాలు
గద్వాల క్రైం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎక్కడా, ఎలాంటి సమస్య తలెత్తకుండా వి ధులు నిర్వహించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. ఈనెల 11న జిల్లా లో మొదటి దశ పోలింగ్ ఉండడంతో జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలోని గ్రీవెన్స్ హాలులో మంగళవారం పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులపై సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆ యన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో భద్రత, రూట్ మొబైల్ టీంలు, రూట్ ఇన్‌చార్జీలు, క్యూఆర్‌టీ, స్ర్టెకింగ్ ఫోర్స్, స్సెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్ అన్ని రకాల ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన పనులు, నివారించాల్సిన అంశాలను స్పష్టంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విఽదులు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, మద్యం, డబ్బు ఉచితాలు పంపిణీ వంటి అక్రమాలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగల వాతావరణాన్ని కల్పించాలన్నారు. సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, ఆర్‌ఐ వెంకటేశ్, గద్వాల సీఐ టి.శ్రీను, అధికారులు ఉన్నారు.