Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం వద్దు

ABN , Publish Date - Apr 16 , 2025 | 11:31 PM

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వే గంగా పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం వద్దు

పనుల పురోగతిపై అధికారులతో జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ సమీక్ష

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వే గంగా పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై బుధవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్‌హాలు లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పఽథకానికి అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పను లు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిం చి త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. గ్రామస్ధాయిలో అధికారులు ఇందిర మ్మ ఇళ్ల కమిటీ సభ్యులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్యవేక్షణకు ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేక అఽధికారిని నియమించినట్లు తెలిపారు. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శుల సమన్వయంతో స్థలాలను గుర్తించి బేస్‌ మెంట్‌ నిర్మాణం నిర్ధారించాలని ఆదేశించారు. ప్రతీ వారం నిర్మాణ పురోగతిపై నివేదికను సమర్పించాలన్నారు. అలాగే రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై సమీక్ష నిర్వహించారు.సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, డీపీవో నాగేంద్రం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేశ్‌బాబు, పుర కమిషనర్లు ఉన్నారు.

వేసవిలో నీటి సమస్య లేకుండా చూడాలి

వేసవిలో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. నీటి కొరత ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బల్క్‌వాటర్‌ సప్లై, ఓహెచ్‌ఎస్‌ఆర్‌, సింగిల్‌ ఫేజ్‌ చేతిపంపులు, ప్రైవేట్‌ బోర్‌వేల్స్‌, ట్యాంకర్లు వంటి అన్నిమార్గాలను సమర్థవంతంగా ఉపయోగించి నీటి సమస్య లేకుండా చూడాలన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 11:31 PM