సీఎం సభతో ఒరిగిందేమీ లేదు
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:07 PM
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సీఎం సభతో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఒరిగింది ఏ మీ లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎల్లేని సుధాకర్‌రావు ఎద్దేవా చేశారు.
- కొల్లాపూర్ అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వని ముఖ్యమంత్రి
- బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు ఎద్దేవా
కొల్లాపూర్, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సీఎం సభతో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఒరిగింది ఏ మీ లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎల్లేని సుధాకర్‌రావు ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టేందుకే బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఎల్లేని విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ విమర్శలు చేయడం కోసమే జటప్రోలు గ్రామానికి వచ్చినట్లు ఉందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా ముఖ్యమంత్రికి మంజూరు చేయలేదని తెలిపారు. ప్రజలను మోసగించడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందేనని ఆయన ధ్వజమెత్తారు. బహిరంగ సభకు కూ తవేటు దూరంలో రాజకీయ హత్యకు గురికాబడ్డ బొడ్డు శ్రీధర్‌రెడ్డి నింధితులను శిక్షించి ఆ వృద్ధు తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి మీకు ఏ శక్తి అడ్డుగా నిలిచిందని ఎల్లేని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి జూపల్లికి ఓటు వేసి గెలిపించిన కొల్లాపూర్ ప్రజలను మభ్య పెట్టడం తగదన్నారు.