మీ చర్మంతో చెప్పులు కుట్టించినా తప్పులేదు
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:15 PM
బీఆర్‌ఎస్ పది సంవత్సరాల పాలనలో కోట్ల రూపాయల ప్రజాఽధనాన్ని అక్రమంగా ఆర్జించిన మీరు రాష్ట్ర ప్రజలకు మీ చర్మంతో చెప్పులు కుట్టించినా తప్పులేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.
- అప్పుడు అక్రమార్జన, ఇప్పుడు బాకీ కార్డులు
- వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
పెద్దమందడి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ పది సంవత్సరాల పాలనలో కోట్ల రూపాయల ప్రజాఽధనాన్ని అక్రమంగా ఆర్జించిన మీరు రాష్ట్ర ప్రజలకు మీ చర్మంతో చెప్పులు కుట్టించినా తప్పులేదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. పెద్దమందడి మండలంలోని పామిరెడ్డి గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ తరఫున రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ వనపర్తిలో భూకబ్జాలు చేసి, చెరువు కట్టల పేరున, అభివృద్ధి మాటున రూ. 400 కోట్లు అక్రమార్జన చేసిన వారికి ఇప్పుడు బాకీ కార్డులు పట్టుకొని తిరిగే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను పదవిలో ఉన్నంత కాలం పాలమూరు అభివృద్దికి ఏటా రూ. 25 వేల కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గానికి మొత్తం 2,500 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందులో మొదటి విడుతగా 890 క్వింటాళ్లను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, జడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకటస్వామి, రమేశ్‌గౌడ్, నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.