Share News

బంగారు, వెండి ఆభరణాల చోరీ

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:29 PM

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మళ్లీ దొంగలు పడ్డారు. బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు.

 బంగారు, వెండి ఆభరణాల చోరీ
బీరువాను ధ్వంసం చేసిన దుండగులు

గద్వాల క్రైం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మళ్లీ దొంగలు పడ్డారు. బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఇందుకు సంబంధించి స్థానికులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణంలోని పాత హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న ఉషారాణి గత ఆదివారం నుంచి ఫ్యామిలితో తిరుపతికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించిన దొంగలు ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఎ త్తికెళ్లినట్లు సమాచారం. 5 తులాల బంగారం తో పాటు 30 తులాల వెండి చోరీ జరిగినట్లు తెలుస్తున్నది. పట్టణ రెండవ ఎస్‌ఐ సతీష్‌రెడ్డి వివరాలను సేకరించారు.

హోటల్‌, నిర్మాణ ఆసుపత్రిలో దొంగల హల్‌చల్‌

అలంపూరుచౌరస్తా, (ఆంధ్ర జ్యోతి): మానవపాడు మండలం, పోతులపాడు గ్రామానికి చెందిన డాక్టర్‌ అమీర్‌ అలంపూరు చౌరస్తాలో నివాసం ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రి లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో వీరు నిర్మిస్తున్న ప్రైవేటు ఆసుపత్రి భవనంలో బుధవారం తెల్లవారుజామున నిలువ ఉంచిన వైద్య పరికరాలు, కొన్ని పనిముట్లు చోరీకి గుర య్యాయి. సుమారు రూ.50వేల విలువైన పరిక రాలను ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపాడు. స మీపంలోని ఓ హోటల్‌ను కూడా టార్గెట్‌ చేశా రు. ముసుగు వేసుకుని హోటల్‌లోకి ప్రవేశిం చిన దుండగులు మొదట కెమారాలు పగులగొ ట్టారు. బంకులోకి చొరబడి శీతలపానీయాలు, ఐస్ర్కీంలు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపా డు. ఈ చోరీలో ముగ్గురు యువకులు పాలొ ్గన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. విచా రణ చేపట్టామని, గట్టి నిఘా కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌ తెలిపాడు.

Updated Date - Nov 12 , 2025 | 11:29 PM