Share News

రెండిళ్లలో చోరీ

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:55 PM

ముమ్మళపల్లి గ్రామంలో ఐదు ఇళ్ల లో దొంగతనాలు జరిగి వారం రోజులు గడవక ముందే వనపర్తి జిల్లా కొ త్తకోటలో మరో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.

రెండిళ్లలో చోరీ
దొంగతనం జరిగిన కురుమూర్తి ఇంటిని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, పోలీసులు

- పరిశీలించిన డీఎస్పీ

కొత్తకోట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ముమ్మళపల్లి గ్రామంలో ఐదు ఇళ్ల లో దొంగతనాలు జరిగి వారం రోజులు గడవక ముందే వనపర్తి జిల్లా కొ త్తకోటలో మరో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీకాంత్‌రెడ్డి తన కుమారుడు రోడ్డు ప్రమా దంలో గాయపడగా చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు కుటుంబ సభ్యులతో క లిసి హాస్పిటల్‌కు వెళ్లారు. గమనించిన దొంగలు రాత్రివేళ ఇంటికి తాళం వేసి చాకచక్యంగా తీసి బీరువాలో ఉన్నరెండు తులాల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లాడు. ఆదివారం ఇంటికి వచ్చిన లక్ష్మీకాంత్‌రెడ్డి తాళం ఊడి ఉండడా న్ని గమనించి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గ్రహించాడు. అలాగే దండుగడ్డ కాలనీలో ఉంటున్న కురుమూర్తి కుటుంబ సభ్యులు అందరు కలిసి చెలిమిల్లకు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. తలుపులకు ధ్వంసమైన తాళం చూసి అవాక్కయ్యాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు విరగ్గొట్టి 12 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి గొలుసులు, రూ. 45 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్‌ టీంను ర ప్పించి ఆనవాళ్లు సేకరించారు. దొంగతనం జరిగిన ఇళ్లను డీఎస్పీ వెంకటేశ్వర్‌ రావు పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 10:55 PM