Share News

కల్వకుర్తిలో చోరీ

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:18 PM

తాళం పగులగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదును చోరీ జరిగిన సంఘటన సోమవారం ఉదయం కల్వకుర్తి పట్టణంలో వెలుగులోకి వచ్చింది.

కల్వకుర్తిలో చోరీ
చోరీ జరిగిన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐలు మాధవరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి

- 40 తులాల బంగారు ఆభరణాలు,

రూ.6 లక్షల నగదు అపహరణ

కల్వకుర్తి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తాళం పగు లగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదును చోరీ జరిగిన సంఘటన సోమవారం ఉదయం కల్వకుర్తి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యా నగర్‌ కాలనీలోని నివాసం ఉంటున్న శ్రీనివాస్‌శర్మ వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వేరే ఊరికి వెళ్లారు. సోమవారం తిరిగి ఇంటికి రాగా ఇం టి తాళం పగలగొట్టి ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నా యి. ఇంట్లో దాచి ఉంచిన 40తులాల బంగారం, రూ.6లక్షల నగదు కన్పించలేదు. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీం ద్వారా దొంగల ఆచూకీ కోసం నమూనాలు సేకరిం చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జీ మాధవరెడ్డి, తెలిపారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ నాగార్జునలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - Dec 08 , 2025 | 11:18 PM