Share News

పనులు నాణ్యతగా చేపట్టాలి

ABN , Publish Date - Aug 05 , 2025 | 10:55 PM

కర్వెన రిజర్వాయర్‌ పనులు నాణ్యతగా చేపట్టాలి అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసిహారెడ్డి పేర్కొన్నారు.

పనులు నాణ్యతగా చేపట్టాలి
కర్వెన రిజర్వూయర్‌ మ్యాపును పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌

- అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసిహారెడ్డి

- కర్వెన రిజర్వాయర్‌ పరిశీలన

భూత్పూర్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : కర్వెన రిజర్వాయర్‌ పనులు నాణ్యతగా చేపట్టాలి అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసిహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కర్వెన రిజర్వాయర్‌తో పాటు అందుకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయి? ఇంకా ఎంత వరకు పని మిగిలి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి

మూసాపేట : భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం అడ్డాకుల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, భూ భారతి ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రక్రియ ఎంత వరకు సాగుతుందని ఆరా తీశారు. అదే విధంగా పెండింగ్‌ లో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి? వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు. ఇబ్బందులు ఏమైన ఉన్నాయా అని తహసీల్దార్‌ను అడిగి తెలుసున్నారు. అనంతరం ఉద్యోగుల హాజరు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. తహసీల్దార్‌ శేఖర్‌, నయాబ్‌ తహసీల్దార్‌ ఖలీద్‌ బీన్‌ఎక్బాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 10:55 PM