నాటి కలెక్టర్ మాటలు నాలో స్ఫూర్తినింపాయి
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:34 PM
తాను పదో తరగతిలో ఉన్నప్పుడు పాల్గొన్న సమావేశానికి హాజరైన అప్పటి మైసూర్ కలెక్టర్ చెప్పిన విలువైన మాటలే నన్ను ఐఏఎస్ స్థాయి కి చేరుకునేలా స్ఫూర్తినింపాయని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ చెప్పారు.
- జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల సర్కిల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తాను పదో తరగతిలో ఉన్నప్పుడు పాల్గొన్న సమావేశానికి హాజరైన అప్పటి మైసూర్ కలెక్టర్ చెప్పిన విలువైన మాటలే నన్ను ఐఏఎస్ స్థాయి కి చేరుకునేలా స్ఫూర్తినింపాయని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ చెప్పారు. గురువారం గద్వాలలోని ప్రభుత్వ బాలుర ఉన్న త పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ ఉచిత పంపిణీ కార్యక్రమా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు. ప్రస్తుత ఎస్‌బీఐ జాతీయ చైర్మన్ చల్లా శ్రీనివాస్‌శెట్టి ఇదే పాఠశాల పూర్వవిద్యార్థి కావడం గొప్ప విషయమని అన్నారు. విలువలు, సామాజిక స్పృహ, సేవాభావంతో కూడిన అంశాలపై విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాఠశాల విద్యలో పదో తరగతి చాలా కీలకమైనదని చెప్పారు. ఏ చిన్నపాటి ఉద్యోగానికైనా కనీస అర్హత పదో తరగతే అని వివరించారు. కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునేలా శ్రమించాలన్నారు. పుస్తకాల్లోని పాఠ్యాంశాలతో పాటు స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పది ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని చెప్పారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలు శ్రద్ధగా వినాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనలతో పాటు వారి మాటలు, సూచనలు సలహాలు పాటించే ఏ విద్యార్థికైనా బంగారు భవిష్యత్ దొరుకుతుందన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్కరు అడుగులు వేయాలని సూచించా రు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితం గా అందజేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఛైర్మన్ రత్నసింహారెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవి, ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.