జర్నలిస్టుల సంక్షేమమే మా లక్ష్యం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:29 PM
జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ప్రెస్‌క్లబ్ కార్యవర్గ ప్రధాన లక్ష్యమని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ఆరోపణలు పట్టించుకోమని మహబూబ్‌నగర్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నరేంద్రాచారి, నరేందర్‌గౌడ్ తెలిపారు.
- ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నరేంద్రాచారి, నరేందర్ గౌడ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ప్రెస్‌క్లబ్ కార్యవర్గ ప్రధాన లక్ష్యమని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ఆరోపణలు పట్టించుకోమని మహబూబ్‌నగర్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నరేంద్రాచారి, నరేందర్‌గౌడ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు కార్యవర్గ సభ్యులతో కలిసి మాట్లాడారు. కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా ప్రెస్‌క్లబ్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. ప్రెస్‌క్లబ్ అభివృద్ధికి ఎస్టిమేషన్ వేయించామన్నారు. కొన్ని అత్యవసర పనులను దాతలనే చేయించాలని కోరామని తెలిపారు. ఆరోపణలు చేసేవారు ప్రెస్‌క్లబ్ వేదికగా ముందుకురావాలని, అందరి సమక్షంలో చర్చించి వాస్తవాలు జర్నలిస్టులకు తెలుపుదామన్నారు. త్వరలోనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి సభ్యులకు వివరాలు వెల్లడిస్తామన్నారు. ఉపాధ్యక్షుడు వెంకటేశ్, ధరణికాంత్, జాయింట్ సెక్రటర్రీలు మణిప్రసాద్, కృష్ణ, ఈసీ మెంబర్లు రవికుమార్, షాబుద్దీన్, రాంకొండ పాల్గొన్నారు.