రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:32 PM
ముఖ్యమంతి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి
- మార్కెట్ యార్డులో సీసీ కెమెరాల ప్రారంభం
నారాయణపేట, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంతి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను ఆమె ప్రారంభించి, మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడో కన్ను నిఘాతో నిరంతరం పర్యవేక్షిం చడం జరుగుతుందన్నారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, డైరెక్టర్లు, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్ లక్ష్మణ్ తదితరులున్నారు.
వందరోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఒక మార్పు అభివృద్ధికి మలుపు నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ ప్రాంతాల్లో రూ పొందించిన వందరోజుల కార్యక్రమాన్ని సోమ వారం నారాయణపేట మునిసిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్‌లు జెండా ఊపి ప్రారంభించారు. మునిసిపల్ కార్యాలయం నుంచి నర్సిరెడ్డి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వ హించి చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ భోగేశ్వర్లు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం
నారాయణపేట మునిసిపాలిటీ పరిధిలోని 22 వార్డులో ఇందిరమ్మ లబ్ధిదారురాలు ప్రమీల ఇంటి నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ముగ్గు వేసి, భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం మెట్రో ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి 306 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు అందించి, మాట్లాడారు. ఇల్లులేని ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, హౌసింగ్ పీడీ శంకర్, మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, ఆర్టీఏ బోర్డు సభ్యుడు పోషల్ రాజేష్, కాంగ్రెస్ నాయకులు సలీం, బండి వేణుగోపాల్, సుధాకర్, లిఖీ రఘుబాబు తదితరులున్నారు.