Share News

సంక్షేమ బోర్డును కొనసాగించాలి

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:59 PM

భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డును యధావిధిగా కొనసాగించాలని సీఐటీయూ జోగుళాంబ గద్వాల జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ అన్నారు.

సంక్షేమ బోర్డును కొనసాగించాలి

  • లేబర్‌ కోడ్‌ల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీజేపీ

  • సీఐటీయూ జిల్లా కార్యదర్శి నరసింహ

ఉండవల్లి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ బోర్డును యధావిధిగా కొనసాగించాలని సీఐటీయూ జోగుళాంబ గద్వాల జిల్లా కార్యదర్శి వీవీ నరసింహ అన్నారు. ఆదివా రం ఉండవల్లిలో తెలంగాణ బిల్డింగ్‌, ఇతర కన్‌ స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వ ర్యంలో మండల మూడో మహాసభను అబ్దుల్‌ ఖదీర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మి కుల కోసం సీఐటీయూ ఎన్నో ఏళ్లుగా పొరాటం చేస్తోందన్నారు. దీర్ఘకాల ఉద్యమాల ఫలితంగా 1996లో వెల్ఫేర్‌ బోర్డు చట్టాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అమ లు చేశారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌ల పేరుతో ఈ చట్టాన్ని ని ర్వీర్యం చేసే విధంగా సవరణలు చేయడం ఆం దోళనలు కలించేందిగా ఉందన్నారు. చట్టాన్ని యధావిధిగా కొనసాగించేందుకు కార్మివర్గం ఐ క్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. జిల్లాలో సుమారు 20వేల మంది కా ర్మికులు రెన్యూవల్‌ చేసుకోలేదని, అర్హులైన వా రికి వెంటనే రెన్యూవల్‌ సదుపాయం కల్పించా లని విజ్జప్తి చేశారు. అలాగే బోర్డు నిధులను దళారీ వ్యవస్థ ద్వారా అనర్హులకు మళ్లించే చర్య లను ఆపేందుకు జిల్లా యంత్రాంగం తగిన చ ర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ టీ యూ మండల కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఈదన్న, వృత్తిదారుల సంఘం నాయకుడు ప్రాగటూరు మద్దిలేటి, లా యర్ల సంఘం జిల్లా నాయకులు లక్ష్మన్న,మధు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు రాఘవేంద్ర, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అలీ అక్బర్‌, ఆశన్న, మధు, కృష్ణ, గోపి, మైనుద్దీన్‌, బాలరాజు, నరసింహ, లోకేశ్‌, వెంకటేశ్వర్లు, బాలరాజు ఉన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 11:59 PM