కనుల పండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:26 PM
నాగర్‌కర్నూల్ పట్ట ణంలోని రాంనగర్ కాలనీలో సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది.
- హాజరైన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, సరిత దంపతులు
కందనూలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ పట్ట ణంలోని రాంనగర్ కాలనీలో సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించిన లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవానికి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రె డ్డి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, ఆయన సతీమణి సరితలు హాజరయ్యారు. ఎమ్మెల్యే దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల త లంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా చూడాలని కోరారు. మా ర్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.