పోరాట యోధుడు పండుగ సాయన్న
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:18 PM
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరం తరం పోరాటం చేసిన గొప్పవ్యక్తి పండుగ సాయన్న.
పాలమూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరం తరం పోరాటం చేసిన గొప్పవ్యక్తి పండుగ సాయన్న. ఆయనను స్మరించుకోవటం మనంద రి బాధ్యత అని మాజీ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పండుగ సాయన్న వ ర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్ ఏరియాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భవిష్యత్ తరాలకు పండు గ సాయన్న చరిత్ర తెలియాలన్నారు. భూ స్వా ములు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి పేదలకు ఆదుకున్న దేవుడు పండుగ సాయన్న అన్నారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, గంజి వెంకన్న, కోరమోని నరసింహులు, బెక్కెం జనార్దన్, శివరాజు, అనంతరెడ్డి, శ్రీనివా స్‌రెడ్డి, సుధాకర్, అహ్మదుద్దీన్ పాల్గొన్నారు.