Share News

వక్ఫ్‌ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - May 23 , 2025 | 11:02 PM

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ డిమాండ్‌ చేశారు.

వక్ఫ్‌ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ

- 25న నిర్వహించే నిరసన సభకు కాంగ్రెస్‌ మద్దతు

- డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో జరగాల్సిన సభ అప్పటి పరిస్థిలును అనుగుణంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈనెల 25న సాయంత్రం 7 గంటలకు బాలుర కళాశాల మైదానంలో వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే బహిరంగ సభకు ఉమ్మడి జిల్లాలోని ముస్లింలు ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సభకు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనాల్‌ బోర్డు అఽధ్యక్షుడు ఖాలెద్‌ సైఫుల్లా కర్టాటక మాజీ ఎంపీ సీఎం ఇబ్రాహీం ఇతర మతపెద్దలు హాజరుకానున్నట్లు తెలిపారు. మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ షబ్బీర్‌అహ్మద్‌, కాంగ్రెస్‌ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫయాజ్‌, నాయకులు పీర్‌సాధిక్‌, అజ్మత్‌అలీ, ఫక్రుద్దీన్‌, ఖాజాపాష, అంజద్‌, ఫహీం పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ మద్దతు

వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఇంతియాజ్‌ఇసాక్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన సీఎంలు చంద్రబాబు, నీతిశ్‌కుమార్‌లకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్లమెంటులో ఈ బిల్లును బీఆర్‌ఎస్‌ ఎంపీలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకులు మోసీన్‌, హఫిజ్‌ఇద్రీస్‌, అహ్మద్‌సనా, ఇమ్రాన్‌, దానిష్‌, జహంగీర్‌, సుల్తాన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:02 PM