ముగిసిన మూడో విడత ప్రచారం
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:44 PM
జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సా యంత్రం ముగిసింది.
గ్రామాల్లో మూగబోయిన మైకులు
ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు
జోరందుకున్న మద్యం, మాంసం, డబ్బు పంపకాలు
రేపే సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్
గద్వాల/వనపర్తి/అచ్చంపేట, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సా యంత్రం ముగిసింది. ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వివిధ మా ర్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మద్యం, మాంసం పంపిణీ చేయడంలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి లాం టి ప్రధాన పంచాయతీలలో ఒక్కో ఓటుకు రూ.3 వేలు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదని తెలుస్తోంది. మూడో విడతలో ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, అలంపూర్ మండలాల్లోని 75 సర్పంచ్ స్థానాలకు, 700 వార్డు స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ 7 సర్పంచ్ స్థానాలు, 139 వార్డు స్థానాలు ఏకగ్రీవం చేశారు. దీంతో 68 గ్రామ పంచాయతీల్లోని 561 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిం చనున్నారు. ఇందుకోసం 638 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 1,00,372మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వనపర్తి జిల్లాలో మూడో విడతలో పెబ్బేరు, శ్రీరంగాపూర్, పాన్‌గల్, చిన్నంబావి, వీపనగం డ్ల మండలాల్లో బుధవారం ఎన్నికలు జరగను న్నాయి. వీటి పరిధిలో 87 సర్పంచ్ స్థానాలు, 806 వార్డు స్థానాలు ఉండగా 7 సర్పంచ్ స్థానాలు, 104వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. మిగతా 80 సర్పంచ్, 702 వార్డు స్థానా లకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు 24గంట ల సమయం ఉండడంతో ప్రలోభాల పర్వం కీలకంగా మారింది. ఆరున్నరేళ్ల తర్వాత జరు గుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కొందరు నగదు, మద్యం, మాం సం విచ్చలవిడిగా పంచుతున్నారు. ఈ ఎన్నిక లు పార్టీలకతీతంగా జరుగుతున్నా ప్రతీ అభ్య ర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే ఉన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలోని 7 మండలాల్లోని 158 సర్పంచ్ స్థా నాలకు, 1364 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వ హించాల్సి ఉన్నది. కానీ 18 సర్పంచ్ స్థానాలు, 252 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అమ్రాబాద్ మండలంలోని 5 గ్రామపంచాయతీ లకు అభ్యర్థులు లేక ఎన్నికలు జరగడంలేదు. చారగొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ ప్రజ లు ఎన్నికలు బహిష్కరించడంతో ఆ గ్రామంలో ఎన్నికలు జరగడంలేదు. మిగిలిన 134 సర్పం చ్ స్థానాలకు 390మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా 1,364 వార్డులకు గాను 252 వార్డులు ఏకగ్రీవం కాగా 44 వార్డులకు ఎన్నికలు జరగడంలేదు. మిగిలిన 1,068 వార్డు స్థానాలకు 2,455 మంది అభర్థులు బరిలో నిలి చారు. పోలింగ్ రోజు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 950 మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు.