ఉగ్రవాదుల దాడి హేయమైంది
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:22 PM
పహల్గాంలో యాత్రికులపై మూకుమ్మడిగా ఉగ్రవాదులు దాడి చేసి అమానీయంగా ప్రజలను చంపడం హేయమైన చర్య అని, ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా పెట్టుకొని దాడి చేసి చంపడం దారుణమైన విషయమని శక్తిపీఠం స్వామి శాంతానంద అన్నారు.
- శక్తిపీఠం స్వామి శాంతానంద
నారాయణపేట, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో యాత్రికులపై మూకుమ్మడిగా ఉగ్రవాదులు దాడి చేసి అమానీయంగా ప్రజలను చంపడం హేయమైన చర్య అని, ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా పెట్టుకొని దాడి చేసి చంపడం దారుణమైన విషయమని శక్తిపీఠం స్వామి శాంతానంద అన్నారు. నారాయణపేటలో శుక్రవారం రాత్రి శక్తిపీఠం నుంచి సెంటర్ చౌక్‌బజార్ వరకు ఉగ్రదాడులను ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కో ల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.