టేస్ట్ అదిరింది..
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:16 PM
భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లాలోని వాగులు, వంకలు, ప్రాజెక్టుల వద్ద జలసవ్వడు లు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
-- డిండి ప్రాజెక్టువద్ద నోరూరించే చేపవంటకాలు
- ప్రైకోసం బారులు తీరుతున్న భోజన ప్రియులు
- ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చేపల విక్రయ కేంద్రాలు
- దుందుభీ ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ.. చేపల రుచులను ఆరగిస్తున్న పర్యాటకులు
అచ్చంపేట, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లాలోని వాగులు, వంకలు, ప్రాజెక్టుల వద్ద జలసవ్వడు లు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఈ నెల 15 నుంచి డిండిప్రాజెక్టు మత్తడి దూకుతోంది. ఈ ప్రాజెక్టు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉండడంతో శ్రీశైలం వెళ్లి వచ్చే భక్తులు ప్రాజెక్టు అందాలను తిలకిస్తున్నారు. చల్లటి వాతావరణంలో ప్రాజె క్టు సమీపంలో గుమగుమలాడే చేపలఫ్రై, కర్రీ వంటలు పర్యాట కుల నోరూరిస్తున్నాయి. ఇటు జల సవ్వడులు, అటు చేప వంటల రుచులు చూస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.