Share News

పనులు గడువులోగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:32 PM

కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీ త గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అన్నారు.

పనులు గడువులోగా పూర్తి చేయాలి
సమావేశంలో అభివృద్ధి పనులపై అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌ సంతోష్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

వంగూరు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీ త గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అన్నారు. బుధవారం వంగూరు మండలంలోని సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, అ చ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించారు. గ్రా మ పంచాయతీ కార్యాలయంలో విద్యుద్దీకరణ, సోలార్‌ గ్రామం ప్రణాళిక, పలు అభివృద్ధి పనుల పై సంబంధిత శాఖల అధికారులతో వారు సమీ క్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో జరుగు తున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధి కారి స్థానిక, సంస్థల అదనపు కలెక్టర్‌ దేవసహా యం అభివృద్ధి పనుల గురించి కలెక్టర్‌కు వివ రించారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ అధికారు లతో శాఖల వారిగా సమీక్షించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ అభివృద్ధి పనులపై తర చూ మానిటరింగ్‌ నిర్వహించి లోపాలను సరిది ద్దాలన్నారు. చిల్డ్రన్‌ పార్కు లు, ఓపెన్‌ జిమ్‌లు, యూని యన్‌ బ్యాంక్‌, ఫోస్టాఫీస్‌, ప్రాథమికోన్నత పాఠశాల అ దనపు భవనాలు, విద్యుద్ధీకర ణ వంటి అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటి స్తూ అన్ని వసతులతో రూపు దిద్దుకోవాలన్నారు. గ్రామం లో జరుగుతున్న రోడ్డు విస్త రణ పనులను కలెక్టర్‌ పరిశీ లించారు. కొండారెడ్డిపల్లి ని వంద శాతం సోలార్‌ వి ద్యుత్‌ గ్రామంగా తీర్చిదిద్దాల ని, ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టాని రెడ్కో అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మె ల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రా మం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సక్రమంగా, సకాలంలో పూర్తి చేయాల ని అధికారులకు ఆదేశించారు. అచ్చంపేట నియో జకవర్గానికి గుర్తింపు తెచ్చేలా కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు జరగాలన్నారు. అభివృద్ధి పను లను క్షేత్ర స్థాయిలో, ఎమ్మెల్యే పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎనుముల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేందర్‌, మాజీ ఉపసర్పంచ్‌ వేమారెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:32 PM